Home  »  TV News  »  Brahmamudi : ఇందు ప్లాన్‌తో అదిరిపోయిన రాజు తల్లిదండ్రుల వెడ్డింగ్ యానివర్సరీ 

Updated : Apr 25, 2026

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1015 లో.... ఇందు చాలా హ్యాపీగా ఉంటుంది. రాజు తన చిన్నచిన్న సరదాలన్నీ తీరుస్తాడు. దాంతో ఇందు సంతోషానికి అవధులు లేకుండా పోతాయ్. రాజు పక్కన కూర్చొని నువ్వు ఏం చేస్తావ్ మీ ఫ్యామిలీ ఏంటని అడుగుతుంది. రాజు తన ఫ్యామిలీ గురించి చెప్తాడు. ఏం చదువుకున్నావ్ జాబ్ చూసుకోవచ్చు కదా ఈ రౌడీ పనులు ఏంటి అని ఇందు అంటుంది. మనకి ఎవడు జాబ్ ఇస్తాడని రాజు అంటాడు. ఆ తర్వాత నాకు నిద్ర వస్తుంది.. ప్లీజ్ ఒక పాట పాడండి అని ఇందు అంటుంది.. రాజుకి ఇష్టం లేకున్నా ఇందు నిద్రపోయేవరకు పాట పాడుతాడు.

రాజు ఒళ్ళో ఇందు నిద్రపోతుంది. మరొకవైపు చక్రి ఇంటికి రేఖ, భూషణ్ వెళ్తారు. మిగతా యాభై లక్షలు ఇవ్వమని రేఖ అడుగుతుంది. డబ్బులు లేవని చక్రి మొహం మీదే చెప్తాడు. ఇంతవరకు అన్ని డబ్బులు ఇచ్చాను.. ఒక్క పైసా అన్న తిరిగి ఇచ్చారా.. నేను ఇవ్వనని చక్రి అనగానే రేఖ, భూషణ్ డిస్సపాయింట్ తో ఇంటికి వెళ్తారు. మరొకవైపు రాజుకి వెంకీ ఫోన్ చేస్తాడు. అప్పుడే రాజు, ఇందు నిద్ర లేస్తారు. ఒరేయ్ ఈ రోజు అమ్మానాన్నల పెళ్లి రోజు అని వెంకి చెప్పాగానే సరే నేను చికెన్ కి డబ్బులు పంపిస్తానని రాజు ఫోన్ కట్ చేస్తాడు. ఏమైందని ఇందు అడుగుతుంది. ఈ రోజు అమ్మానాన్నల పెళ్లిరోజు అని రాజు చెప్తాడు. పెళ్లి రోజు ఎవరైనా అలా సెలబ్రేట్ చేసుకుంటారా అని ఇందు అంటుంది. అంత డబ్బులు మా దగ్గర లేవని రాజు అంటాడు.

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను పెళ్లి రోజు జరిపిస్తానని ఇందు అంటుంది. వద్దని రాజు అనగానే మరి ఓనర్ కి చెప్తానని ఇందు బ్లాక్ మెయిల్ చెయ్యడంతో రాజు సరే అంటాడు. ఎవరని.. ఏం చెప్పాలని రాజు అనగానే ఈవెంట్ ప్లానర్ అని చెప్పు అని ఇందు చెప్తుంది. తరువాయి భాగంలో రాజు పేరెంట్స్ ఇరవై అయిదో పెళ్లి రోజుని ఉన్నంతలో ఇందు సెలబ్రేట్ చేసి అందరికి భోజనాలు పెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.